ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీకానున్న సీఎం రేవంత్ రెడ్డి.
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ/డిసెంబర్ 19:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
సిఎం మంగళవారం ఉద యమే బయల్దేరి ఢిల్లీ వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో కూడా భేటీ కానున్నారు.
మంత్రివర్గ విస్తరణతోపాటు ఎమ్మెల్సీల ఎన్నికపై కూడా ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతలతో చర్చించనున్నారు.
పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవాలని రేవంత్ భావి స్తున్నారు. ఈమేరకు ప్రధాని అపాయింట్ మెంట్ కోరారు.