CEIR పోర్టల్ గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి – వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ
హ్యూమన్ రైట్స్ టుడే/రాజన్న సిరిసిల్ల జిల్లా/వేములవాడ/డిసెంబర్ 18: వేములవాడ రూరల్ మండలం పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్ ద్వారా కనుక్కొని బాధితులకు తిరిగి అప్పగించిన వేములవాడ రూరల్ పోలీసులు. ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయినట్టు అయితే CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్)లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్ ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో, ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం రాగానే ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ ను స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న వ్యక్తి కి అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. CEIR ద్వారా తంగళ్లపల్లి మండలం రామన్న పేట గ్రామానికి చెందిన తిరుపతి కి తన ఫోన్ అందించటం జరిగింది అని తెలిపారు. బాధితుడు వేములవాడ రూరల్ పోలీస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.