కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /డిసెంబర్ 12: సివిల్ సప్లై శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వంద రోజుల్లో రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు. కేజీ రూ.39 పెట్టి కొనుగోలు చేసిన బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నామని, వాటిని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. దీనిపై రివ్యూ చేస్తామన్నారు.