వికారాబాద్ లో మరిచిపోలేని రోజు !!ప్రేమ..,ధర్నా.. పెళ్లి …!!
హ్యూమన్ రైట్స్ టుడే/వికారాబాద్ / 17 జనవరి 2023: జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో ప్రేమ వ్యవహారంలో ఉదయం ప్రియుడు కేశవులు ఇంటిముందు తన కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగింది ప్రియురాలు గత 13 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆందోళనకు దిగింది ప్రియుడు పెళ్లి చేసుకోనని చెప్పడంతో ప్రియుడు కేశవులు ఇంటికి తాళం వేసి ఇంటిముందు ఆందోళన చేపట్టింది. ఈ విషయంలో గ్రామ పెద్దలు, కులస్తుల సమక్షంలో ఇద్దరిని సముదాయించి ఇరు కుటుంబాలకు నచ్చజెప్పి పెళ్లి చేశారు గ్రామ పెద్దలు కులస్తులు. పెళ్లి అనంతరం సర్దుమనిగిన ప్రేమ వ్యవహారం.