మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత:ఈసీ ఉత్తర్వులుజారీ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 12:
సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేశారు.
ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదన్న అంజనీ కుమార్ విజ్ఞప్తిని పరిగణ నలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని..ఇలాంటి పొరపాటు మరోసారి జరగదని సీఈసీకి అంజనీకుమార్ హామీ ఇచ్చారు. దీంతో ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సీఈసీ సమాచారం ఇచ్చింది.
ఫలితాలు వెలువడు తుండగానే..
డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే.. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలిసి డీజీపీ హోదాలో అంజనీ కు మార్తో పాటు ఇతర పోలీస్ అధికారులు ఆయన ను కలిసి శుభా కాంక్షలు తెలిపారు.
దీంతో ఎన్నికల సంఘం డీజీపీపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లం ఘించారని ఈసీ డీజీపీపై వేటు వేసింది. మరో ఇద్దరు పోలీసు అధికారులు మహేశ్ భగవత్, సందీప్ కుమార్ జైన్‌కు నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో డీజీపీ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసు కుంది. ఆ తర్వాత తెలం గాణ డీజీపీగా రవి గుప్తాను సీఈసీ నియమించింది.
ప్రస్తుతం ఆయనే డీజీపీగా కొనసాగుతుండగా.. ఇప్పుడు అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేటయంతో ఆయనను మళ్లీ డీజీపీగా నియమిస్తారా? మరో ఏదైనా ఏ పోస్టు కేటా యిస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.