మంథని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఆకస్మిక బదిలీ..!
హ్యూమన్ రైట్స్ టుడే/పెద్దపల్లి జిల్లా/డిసెంబర్ 09:
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో గల తెలంగాణా మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి ఎన్.సరిత ని కరీంనగర్ కు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి బి.శఫియుల్లా నేడు ఉత్తర్వులు జారీ చేశారు.
గత రెండున్నర ఏండ్లుగా మంథని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న చేస్తున్న ఈమెపై ఇటీవల పలు ఆరోపణలు, పిర్యాదులు రాగా గతంలో జిల్లా మైనారిటీ గురుకులాల అధికారి కూడా విచారణ జరిపి రాష్ట్ర ఉన్నతా ధికారులకు నివేదిక పంపారు.
ఈమేరకు ఈరోజు రాష్ట్ర కార్యదర్శి ప్రిన్సిపాల్ సరితను మంథని నుండి కరీంనగర్ మైనారిటీ బాలికల పాఠశాలకు బదిలీ చేస్తూ…ఈమె స్థానంలో మంథని మైనార్టీ పాఠశా లలో ఎస్. జీ. టీ గా పనిచేస్తున్న కె.స్వప్న కు ప్రిన్సిపాల్ ఇంచార్జీ భాద్యతలు అప్పగిస్తున్నట్టు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
కాగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మంథని నియోజక వర్గ పరిధిలో ప్రిన్సిపాల్ మొట్ట మొదటి బదిలీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.