మసాబ్ ట్యాంక్ పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయం
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 09:
తెలంగాణలోని మసాబ్ ట్యాంక్ పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమవ్వడం కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ OSD కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ కనిపిం చకుండా పోయాయి. కిటికీ గ్రిల్స్ తొలగించి మరీ దుండ గులు ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ శ్రీనివాస్ ఆధారాలు సేకరించారు. ఫైల్స్ మాయంపై డైరక్టర్‌ను శ్రీనివాస్ ప్రశ్నించగా ఇందుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని డైరెక్టర్ సమాధాన మిచ్చారు.
అయితే ఫైల్స్ అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిన్ననే ఫైల్స్ మాయ మైనట్లు అధికారాలు గుర్తించారు.
ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.