హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 08:
రేపటి నుంచే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నూతన శాసనసభను రేపు సమావేశ పరచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం కంటే ముందే ప్రోటెం స్పీకర్ ను నియమించాల్సి ఉంటుంది.ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ ఒకరిని ప్రోటెం స్పీకర్ గా గవర్నర్ నియమిస్తారు.
ప్రోటెం స్పీకర్ చే రాజ్ భవన్ లో గవర్నర్ ప్రమాణస్వీ కారం చేయిస్తారు. మిగిలిన ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయి స్తారు.
సభ్యుల ప్రమాణ స్వీకార అనంతరం సభాపతి ఎన్నిక చేపడ తారు.తెలంగాణ శాసనసభ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎన్ను కున్న విషయం తెలిసిందే.