హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 05:
తెలంగాణ లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీఎం ఎవ్వరు అన్నది అంతు చిక్కడం లేదు సీఎం పదవి కోసం ఉత్తమ్, భట్టి డిమాండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
సీఎం ఇవ్వకపోతే డిప్యూటీతో పాటు, భార్య పద్మావతికి మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ అడుగుతున్నట్టు తెలిసింది. ఇక తనకు డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ పదవి ఇవ్వాలని భట్టి విక్రమార్క హైకమాండ్‌ను కోరినట్టు ప్రచారం ఉన్నది.
మరో వైపు భట్టికి డిప్యూటీ ఇస్తే తానేం కావాలని దామోదర్ రాజనర్సింహా అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రేవంత్‌కే మద్దతు ఇవ్వగా, ఆయన తమ్ముడు రాజగోపాల్ మాత్రం వెంకట్‌రెడ్డికే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఈ నేపథ్యంలోనే సీఎం అభ్యర్థి ఎంపికపై జాప్యం జరుగుతున్నది. అయితే ఈ వార్తలను భట్టి విక్రమార్క ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
సీఎం ఎంపిక హైకమాండ్ చేతిలో ఉన్నదని, అప్పటి వరకు ప్రసార మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.
సీఎం అభ్యర్థి ఎంపిక ఆలస్యం కావడంతో ప్రస్తుతం హైదరాబాద్ క్యాంపులోని ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించాలని హైకమాండ్ ప్లాన్ చేస్తున్నది. దీంతో ఎమ్మెల్యేలు కానీ నేతలందరినీ క్యాంపు వదిలి వెళ్లాలని పార్టీ నేతలు ఆదేశాలిచ్చారు.
సీఎల్పీ నేత ఎంపికయ్యే వరకూ ప్రతి ఎమ్మెల్యే క్యాంపులోనే ఉండాలని ఏఐసీసీ ఆదేశాలిచ్చింది.
*రేవంత్‌నే సీఎం చేయాలని నినాదాలు*
రేవంత్‌రెడ్డినే సీఎం చేయాలని హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్, రాజ్‌భవన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు. బానే వుంది. మరి సీఎం ఎవరు? డిప్యూటీ ఎవరు? కేబినెట్‌లో ఎవరెవరు? ఆ ముచ్చట అబీ బాకీ హై.
చర్చోపచర్చలు సాగాయి. ఎల్లా హోటల్ నుంచి అబ్జర్వర్స్ టీమ్ ఢిల్లీ బాటపట్టింది. డీకే శివకుమార్, మాణిక్‌రావ్ ఠాక్రే, ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సహా అధిష్టానం పెద్దలతో భేటీ నినాదాలు చేశారు.
పార్టీని గెలిపించిన రేవంత్‌ను కాదని, మరో వ్యక్తిని ఎంపిక చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. దీంతో పార్టీలో గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి.
హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది నేడు తేలనున్నది.