గాంధీభవన్‌కు చేరుకున్న రేవంత్‌రెడ్డి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 03:
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీభవన్‌కు బయలు దేరారు. జూబ్లీ హిల్స్‌లోని నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు రేవంత్ వెళ్లారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా గాంధీభవన్‌కు చేరుకున్నారు.
తెలంగాణలో అధికారం చేపట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ దశగా ముందుకు దూసు కెళ్తున్నారు. 68 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
ఎన్నికల ఫలితాల్లో తొలి విజయాన్ని కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అశ్వారావుపేట, రామగుండం, జుక్కల్, ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు.
కాంగ్రెస్ పార్టీ మాజిక్ ఫిగర్ దాటి మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి.ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.
కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో ఉదయం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.రేవంత్ నివాసం వద్ద టాపసుల మోతతో సంబరాలు చేసుకున్నారు.