హ్యూమన్ రైట్స్ టుడే/వికారాబాద్ జిల్లా/డిసెంబర్ 03:
తెలంగాణ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఘన విజయం సాధించారు.
ఆయన తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి పై సుమారు 33వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
అలాగే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో సైతం రేవంత్ రెడ్డి సుమారు 9వేల ఓట్ల ఆదిక్యతతో ముందంజలో ఉన్నారు.