BRS ఓటమికి కారణాలు….
1.సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత
2.తాము ఎవరిని నిలబెట్టినా జనం గెలిపిస్తారనే అతివిశ్వాసం
3.మీడియాలో పదేళ్లుగా వ్యతిరేక వార్తలు రాకుండా తొక్కిపెట్టడం
4.సొంత మీడియాలో ఆల్ ఈజ్ వెల్ అంటూ ప్రచారం
5.తద్వారా తామను తామే మోసం చేసుకోవటం
6.నిజాలు మాట్లాడేవారి పట్ల నిర్ధయగా వ్యవహరించటం
7.తెలంగాణ అంటే ఆ నలుగురే కనిపించటం
8.కేసీఆర్ ప్రజల్లో విశ్వాసం క్రమంగా కోల్పోవటం
9.కొద్దిరోజులు మోడీని పొగడటం, మళ్లీ తిట్టడం, మళ్లీ పొగడటం, మళ్లీ తిట్టడం
10.టీఆర్ఎస్లో తెలంగాణ ఫ్లేవర్‌ను కోల్పోవటం
11.జాతీయపార్టీ విషయంలోనూ గడియకో మాట
12.దేశంలో ప్రతిపక్షకూటమి పేరుతో నాలుగు రాష్ట్రాలు తిరగటం, మళ్లీ కొంతకాలం మౌనం
13.సొంత రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దలేని వ్యక్తి దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడు? అని భావించిన జనం
14.అవినీతిపరులైన పార్టీ నాయకులను వెనకేసుకుని రావటం
15.బీజేపీ విషయంలో చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని జనం నమ్మటం
16.తెలంగాణ ఉద్యమ కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు నిలవగా ఆ యువతకి ఉద్యోగాల కల్పనలో విఫలం
17.ఇంటర్ లీకేజీ, ఏపీపీఎస్సీ లీకేజి వంటి వాటితో యువతలో వ్యతిరేకత
18.2014లో గెలిచినప్పుడు ఉద్యోగులకు వరాలు, రెండోసారి నిర్లక్ష్యం చేయటంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత
19.కాళేశ్వరం ప్రాజెక్టు లీకేజీలతో ప్రభుత్వ ప్రతిష్ఠకు డ్యామేజీ
20.ఉద్యమపార్టీ అయి ఉండి ఉద్యమకారులను దూరం చేసుకోవటం
21.తెలంగాణ సాధనలో కీలక భూమిక వహించిన ఆర్టీసీ కార్మికుల పట్ల అమానవీయంగా వ్యవహరించటం
22.ఆర్టీసీలో యూనియన్లే లేకుండా చేసి సమ్మెను క్రూరంగా అణిచివేయటం
23.ఉద్యమ గని సింగరేణి కార్మికుల్లోనూ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత
24.మీడియా, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల పట్ల నిరంకుశ వైఖరి ఇష్టపడని ప్రజలు
25.2014లో టీడీపీ, వైసీపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఫిరాయింపులు
26.2018లో సీపీఐ, కాంగ్రెస్, తెలుగుదేశం నుంచి తెరాసలో మరల ఫిరాయింపులు
27.అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్నే తెరాసలో చేర్చేసుకోవటం
28.తెలంగాణ గడ్డ మీద తాము తప్ప ఇతరులు ఉండకూడదనే అసహజ కోరిక
29.పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో స్టింగ్ ఆపరేషన్ చేసి బీఎల్ సంతోష్, అమిత్‌షాల పాత్రపై దేశవ్యాప్తంగా అన్ని కోర్టులకు, పార్టీలకు సీడీలు పంపి ఆ తర్వాత ఎన్నికల్లోనూ అసలు ఆ ఊసే ఎత్తని రాజీ ధోరణి
30.లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కాకుండ రాజీపడ్డారని బలంగా నమ్మిన ప్రజలు
31.ఏపీలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జగన్‌ను ప్రోత్సహించటం
32.చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేటీఆర్ దురుసు వ్యాఖ్యలు
33.దళితబంధు, బీసీ బంధు వందలో ఒకరికే అందటంతో మిగిలిన 99మందిలోనూ వ్యతిరేకత
34.స్థానిక ఎన్నికలు సహా అన్ని ఎన్నికల్లోనూ పదేళ్లుగా కారుకు ఓటేసిన జనంలో ఈసారి మార్పు ఆకాంక్ష
35.MPTC నుంచి అన్ని స్థానికసంస్థల్లోనూ గెలిచిన తెరాస నాయకుల పనితీరుపై వ్యతిరేకత
36.తెలంగాణ రాష్ట్రం ఈ ఎన్నికల్లో కేసీఆర్ అనుకూల ఓటు, కేసీఆర్ వ్యతిరేక ఓటుగా చీలిపోవటం
37.కేసీఆర్ వ్యతిరేక ఓటు వైపు మెజార్టీ జనం సమీకృతులు అవటం
38.అండగా ఉన్న ఆంధ్రా సెటిలర్లు, కమ్మ సామాజికవర్గంను దూరం చేసుకోవటం
39.గెలిచిన ఎమ్మెల్యేలే కాదు మంత్రులకు కూడా సీఎం దర్శనం సులభంగా దొరకకపోవటం
40.కేంద్రంలోని బీజేపీపై వ్యతిరేకత ఉన్న వారు BRS-BJP ఒకటే అని కాంగ్రెస్‌కు ఓటేయటం
41.ఏ మీడియా సహకారం లేకపోయినా ఒంటరిగా, ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ పోరాడటం
42. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే పాజిటివ్ టాక్ ఎక్కువ ఉండాలి. లేదా సగంమంది అయినా మళ్లీ గెలుస్తుందని చెప్పాలి. కానీ ఎవర్ని అడిగినా కాంగ్రెస్ అనే మాట వినవస్తోంది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి బీఆర్ఎస్ ఓటమికి.