సాగర్ కుడి కాలువ నీటి విడుదల ఆపండి:కృష్ణా బోర్డు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 01:
నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు కేఆర్‌ఎంబీ,ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు.
అక్టోబర్ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు విడతల్లో నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నట్టుగా కేఆర్ఎంబీ తెలిపింది .2024 జనవరి,ఏప్రిల్ లో నీరు విడుదల చేయాల్సి ఉందని కేఆర్ఎంబీ వివరించింది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం సరైంది కాదని కేఆర్ఎంబీ వివరించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులను మోహ రించారని తెలంగాణ ఫిర్యాదు చేసినట్టుగా కేఆర్ఎంబీ తెలిపింది.
అంతేకాదు నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించారని కూడ ఫిర్యాదు చేసిన విషయాన్ని కేఆర్ఎంబీ వివరించింది. వెంటనే అటువంటి దూకుడు చర్యలు నిలిపి వేయాలని ఎపిని కోరింది.. తక్షణం తమ ఆదేశాలు పాటించాలని కోరింది.