1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ప్రతి వ్యక్తిపై ఒక లక్ష యాభయి వేల రూపాయలు.
2.దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు ప్రతి వ్యక్తి మీద 75 వేలు.
3. ఒక నియోజకవర్గం లో 3 లక్షల జనాభా అనుకుంటే నియోజక వర్గ ప్రజల పై రాష్ట్రం 4500 కోట్ల అప్పు చేసింది. అలాగే కేంద్రం ఒక నియోజక వర్గంపై
2250 కోట్ల అప్పు
చేసింది.
4. ఇంత అప్పుచేసి నియోజక వర్గానికి చేసిన ఖర్చు ఎంత?
రాష్ట్రం కేంద్రం కలిసి ఒక నియోజక వర్గం పై 6750 కోట్ల అప్పును రుద్దారు. మరి
ఒకొక్క నియోజక
వర్గం కోసం చేసిన ఖర్చు ఎంత? అభివృద్ధి ఎంత?
5. కుటుంబం లో ఐదుగురు సభ్యులుంటే కుటుంబం కోసం రాష్ట్రం చేసిన అప్పు 7. 5లక్షలు. కేంద్రం వేసిన అప్పు 3.75 లక్షలు . రెండు కలిసి మొత్తం 11 లక్షల 25 వేలు.
6. ప్రతి నియోజకవర్గం లో ప్రతి కుటుంబం పై 11 లక్షల రూపాయలకు పైగా అప్పుభారం వేయబడింది.
7. ఇందులో ప్రతి కుటుంబానికి అందినదెంత? చేసినదెంత?
8. ఇదే అప్పు కుటుంబం స్వయంగా తెచ్చుకొని వుంటే ఉపాధి వ్యాపార ఉత్పత్తి రంగాలలో పెట్టుబడులు గా పెట్టిన వుంటే ఎంత లాభం వచ్చివుండేది? పది శాతం లాభం లేదా ఉత్పత్తులు పెరుగుతాయి.
9. కనీసం ఆ డబ్బు బ్యాంకు లో వేసుకున్నా నెలకు 6500 రూపాయలు వేలు వడ్డీ వస్తుంది. 10. ఇపుడు సంక్షేమ పథకాల పేర అందుతున్నదెంత?
6500 రూపాయలు వేలు అందక పోగా ప్రతినెలా ప్రతి కుటుంబం 7000 రూపాయలు వడ్డీ కడుతున్నది. దేశంలో ప్రతి కుటుంబం పై 11 లక్షల అప్పు భారం మోస్తున్న ది. నెలకు 7000 రూపాయలు వడ్డీ భారం మోస్తున్నది.
11. ఇదంతా పన్నుల రూపంలో కట్టాల్సి వస్తున్నది.
12. మరి ఇంత డబ్బు రాష్ట్రం కేంద్రం ఏం చేసింది? ఎవరికిచ్చింది?