“పేద వాడి పేగు గోష – ధనికుడి డబ్బు ధ్యాస”: ఆబాద్

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే /హైదరాబాద్ /17 జనవరి 2023:
హైదరాబాద్ లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో “ఆబాద్” పార్టీ అధ్యక్షుడు హసన్ షేక్ మాట్లాడుతూ నేడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి వరకు తినడానికి తిండి లేక ప్రజలు పస్తులు ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో దేశ సంపదలో 40% వరకు ఒక్కశాతం బిలియనీర్ల చేతుల్లోనే ఉందని ఆక్స్ఫామ్ తన నివేదిక ద్వారా తెలిపింది అని పేర్కొన్నారు. అట్టడుగున ఉన్న సగంమంది జనాభా వద్ద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే కలిగి ఉంటే బిలియనీర్ల సంఖ్య మాత్రం 2020 లో 102 కాగా 2022 నాటికి 166కు పెరిగారని నివేదికలో పేర్కొంది అని అన్నారు. ఇంకా తన నివేదికలో సాధారణ ప్రజలు నిర్ఘాంతపోయే విషయాలను వెల్లడించారని, వాటిని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆర్థిక సమానత్వం లేకుండా దోపిడి ఎలా చేస్తున్నారో తెలుస్తోందని పేర్కొన్నారు. 2017- 2021 మధ్య అసమానంగా పెరిగిన గౌతమ్‌ అదానీ సంపదపై ఒకసారి విధించే పన్నుతో రూ. 1.79 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించవచ్చని, దీంతో దేశంలో ప్రాథమిక పాఠశాలలో 50 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించోచ్చని, దేశంలోని బిలియనీర్లపై ఒకసారి రెండు శాతం పన్ను వసూలు చేస్తే దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలందరికీ వచ్చే మూడేళ్ల పాటు అందించే పోషకాహారానికి అవసరమైన రూ.40,423 కోట్లు పొందవచ్చని
దేశంలోని కేవలం 10 మంది సంపన్నుల (రూ.1.37 లక్షల కోట్లు) పై ఒకసారి 5 శాతం పన్ను విధిస్తే 2022-23 సంవత్సరానికిగానూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (రూ. 86,200 కోట్లు), ఆయుష్‌ మంత్రిత్వ శాఖ (రూ. 3,050 కోట్లు) అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు (రూ. 1.37 లక్షల కోట్లు) రావచ్చని పేర్కొనడం జరిగింది. కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుండి 2022 నవంబరు వరకు భారత్లో బిలియనీర్ల సంపద 121% పెరిగి రోజుకి రూ. 3,608 కోట్ల సంపద వారికి చేరినట్లు తెలుపుతూనే జిఎస్‌టి ద్వారా 2021-22 లో వచ్చిన మొత్తం రూ.14.83 లక్షల కోట్లలో సుమారు 64 % దిగువన ఉన్న 50 శాతం జనాభా నుండి రాగా కేవలం 3% జిఎస్‌టి మాత్రమే మొదటి పది మంది బిలియనీర్ల నుంచి వస్తోందని తెలుస్తోంది అంటే ఎంత మోస పోతున్నామో అర్థం చేసుకోవచ్చు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో డబ్బులు కట్టెదేమో మద్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కాని పన్నులు ఎగగొట్టడం, పన్నులు తప్పించుకునే బడా పెట్టుబడిదారులకు రాయితీల పేరుతో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారికి కొమ్ము కాస్తూ దేశాన్ని అధోగతిలోకి నెట్టి వేస్తూ ఎన్నికల సమయంలో వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకుని వోట్ కు నోట్ ఇవ్వడం ఎన్నికల్లో గెలవడం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం అన్నారు. ఇదేలా ఉన్నదoటే వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు చిన్న చిన్న కాలువలు, వాగులు, నదుల ద్వారా చివరకు మళ్లీ సముద్రంలో కలిసినట్లుగా చుట్టూ తిరిగి మరలా డబ్బులు వాళ్ళ చేతికి చేరే విధంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పక్షపాతి అని పేద ప్రజల సంక్షేమం కోసమే మా ప్రభుత్వం అని నమ్మ పలికి కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు, యజమానులతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని పేద వాడిని ఇంకా పేద వాడిగా చేస్తూ మద్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచి వీళ్ల అందరిని సంక్షోభంలోకి నెట్టి వేస్తూ కార్పొరేట్, ప్రైవేటు పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు బిలియనీర్స్ కు మాత్రం సంక్షేమo జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు తద్వారా డబ్బు సంపాదించి రాజకీయాలు చేస్తూ ఇంకా డబ్బు సంపాదనే ద్యేయంగా పనులు చేస్తూ వారి పబ్బం గడుపుతున్నారు కాని పేద వాడి పేగులు నింపే ప్రయత్నం చేయడం లేదు కరోనా కష్ట కాలం నుంచి ఇప్పటి వరకు సామాన్య ప్రజల బ్రతుకు చితికి పోతుoటే బిలియనీర్స్ ఆదాయం మాత్రం అమాంతం పై పైకి పెరుగుతోంది. అంటే ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి అన్యాయం చేస్తున్నారు. ఎవరికి మేలు చేస్తున్నారో ప్రతి ఒక్కరూ గమనించి రాబోయే రోజుల్లో వాళ్లకు తగిన బుద్ధి చెప్పేందుకు మేధావులు, విద్యావంతులు, యువతి యువకులు, సమ సమాజ నిర్మాణం కోసం పాటు పడే అందరు “ఆబాద్” పార్టీతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చి ఇది ప్రజల పార్టీ ప్రజా సంక్షేమం కోసమే పని చేసే పార్టీ అని తెలియ చేసే విధంగా కార్యాచరణ రూపొందించు కోవాలని అప్పుడు మాత్రమే ప్రజల్లో చైతన్యం కలిగిoచి నిజాయితీ గల నికార్సయిన, అవినీతికి తావివ్వని నాయకుల ఎన్నిక జరిగితే ప్రజా బాగస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలవుతుందని “ఆబాద్” పార్టీ అధ్యక్షులు హసన్ షేక్ కోరారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దినకర్ తో పాటు రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు వీరభద్రం, సుందర్, రమేష్, సౌందర్య, నందు, రాజ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment