28 నుంచి మద్యం షాపులు బంద్..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 27: ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్లను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మూసి వేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
30వ తేదీ పోలింగ్ ముగిసిన అనంతరం తిరిగి షాపులను తెరుస్తారని అన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా, మద్యం నిలువ చేసినా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 236 కేసులు నమోదు చేశామన్నారు. తమ ప్రాంతంలో మద్యం విక్రయించినా, డంప్ చేసినా ఫోన్ నంబర్ 8712658750లో ఫిర్యాదు చేయాలని కోరారు.