ధనిక రాష్ట్రంలో దరిద్రం ఎందుకుంది? : నరేష్ చాగంటి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్ నవంబర్ 26: రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఎదిగింది అయితే 93 లక్షల కుటుంబాలు కంట్రోల్ బియ్యం ఎందుకు తీసుకుంటున్నారు? రేషన్ కార్డుల కోసం లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారు? అకలితో ఎందుకు చేస్తున్నారు? రైతు రాజ్యంగ ఎదిగింది అయితే రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? బ్యాంక్ లలో అప్పులు ఎందుకు చేస్తున్నారు?
11లక్షల కుటుంబాలకు ఇండ్లు ఎందుకు లేవు? గుడిసెల్లో గుడారాల్లో ఎందుకు జీవిస్తున్నారు?
ప్రజలు దనికులైతే దరిద్రంగా ఉన్న ప్రభుత్వ బడులకు పిల్లలను ఎందుకు పంపుతున్నారు?
ప్రజలు ధనికులైతే ప్రభుత్వ దవాఖానకు ఎందుకు? పోతున్నారు? ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
రాష్ట్ర రైతులు 30 లక్షల మోటర్లు నడుపుచుంటే కాళేశ్వరం నీళ్ళు ఎవ్వరి పొలాల్లో పారుచున్నవి?
ధనిక రాష్ట్రంలో నిరుద్యోగం ఎందుకు ఉన్నది?
ధనిక రాష్ట్రంలో భూములు ఎందుకు అమ్మినట్లు?
ధనిక రాష్ట్రంలో బతుకమ్మ చీరలు ఎవ్వరికీ ఇస్తున్నట్లు? ఇంత అభివృద్ధి చెందిన ధనిక రాష్ట్రంగా అవతరించిన ఈ రాష్ట్రంలో ఉచితాలు ఉత్తుత్త పథకాలు ఎందుకు? ఎవరికోసం? ధనిక రాష్ట్రంగా మారిన తర్వాత అసలు సంక్షేమ పథకాలు ఎందుకు? అసలు ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రం కోసం ఇన్ని ప్రలోభాలు, ఆశాలు, ఆర్భాటాలు, రాజకీయా ఎత్తుగడలు ఎందుకు? ఒట్లేసే ఆ ధనిక ప్రజలే ఒట్లేస్తారు కదా? ఇంత అభివృద్ధి చెందిన ధనిక రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రంలో ఇన్ని కోట్ల రూపాయల ఖర్చులు ఎందుకు? ధనిక రాష్ట్రంలో లక్ష కోట్లు పెట్టీ కట్టిన కాళేశ్వరం కుంగితే బాధ ఎందుకు? మరో లక్ష కోట్లు పెట్టీ కట్టవచ్చు? కదా అవును తమ పార్టీ నాయకులకు వందల రూపాయలకే గజం లాగ భూమి రెగ్లరైజ్ చేయడం గుణాత్మక మార్పు.. అందుకే ధనికులుగా ఎదిగిన ఓ ఓటరు ఆలోచించు దనికుడివి నువ్వు అయితే ఈ ఓట్ల ప్రలోభాలలో ఎందుకు మునిగావు? నీ పిల్లలు ఇంకా ఉచిత విద్య, ప్రభుత్వ సీటు కోసం ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఉన్నొడివైన నువ్వు మందుకు బర్యానికి అసపడుతున్నవు? ఉన్నొడివైతే ఎందుకు కష్ట పడటం, ఉద్యోగాలు ఎందుకు, అప్పులు ఎందుకు, రేషన్ ఎందుకు, ఉచితలు ఎందుకు, పింఛన్లు ఎందుకు, రైతు బందు , ఆ..బందు, ఈ..బందులు ఎందుకు? అసలు ఈ రాజకీయాలు ఎందుకు? మేలుకో నీకు కావాల్సింది తెలుసుకో.. నీ జీవితం ఎలాగో ఇలా తగడలాడింది.. మరీ భావితరాల మీ పిల్లల భవష్యత్తును ఆలోచించు..వారికి మార్గదర్శిగా ఉండాలే కానీ నోటుకు ఓటు అమ్ముకోకుండా.. నీ ఓటు విలువ తెలుసుకో..
ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు పేదరిక నిర్మూలన జరగదు.
సొంత ప్రయోజనాలే పార్టీల రాజకీయ నాయకుల లక్ష్యం. మంత్రులకు, ఎమ్మెల్యేలకు వందల వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మనం వారిపై ఆధారపడి జీవిస్తున్నప్రజలు అని… మరీ మనం ఎప్పుడు తలెత్తుకు నిలిచేది?
నరేష్ చాగంటి – ఎడిటర్ & సామాజిక విశ్లేషకులు మొబైల్: 8008078067