హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/నవంబర్ 25: తెలంగాణ కోసం ఉద్యమంలో కొట్లాడినోళ్లు బిచ్చగాళ్ళ అయ్యారు… కొట్లాడనోళ్లు.. కోటీశ్వరులయ్యారనీ… పూర్తిగా ఉద్యమకారులను విస్మరించారని… ప్రజలకు కనువిప్పు కలగాలని ఎంసీపిఐయూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి మైత్రి రాజశేఖర్ వినూత్నంగా నిరసన చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందాయని ద్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో అలు పెరగని పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఉద్యమకారులను, సామాన్య ప్రజలను విస్మరించిందని వాపోయారు. అనాలోచిత విధానాలతో గుండులో గుజ్జు లేకుండా పాలన చేస్తున్న పార్టీల నుంచి అప్రమత్తంగా ఉండాలని అరగుండుతో ప్రచారంతో నిరసన వ్యక్తం చేశానని తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి కాటికి చేరిన శవాల మీద… తినే తిండి మీద జీఎస్టీ పేరుతో దోసుకునే దొంగలు పెట్రోల్ మీద వ్యాట్ తక్కువ చేస్తాననడం హాస్యస్పదమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు. దళితుడిని సీఎం.. దళితులకు 3ఎకరాల భూమి ఎక్కడ అని ప్రశ్నించారు. ఇప్పుడు రూ.400లకే సిలిండర్ ఇస్తా అంటున్నారు. 10ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా యువత, ప్రజలు కళ్ళుతెరిచి కెమెరా గుర్తు మీద ఓటు వేసి గెలిపించి, అసెంబ్లీకి పంపేందుకు దీవించాలని కోరారు.