దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటరుగా ఎంపిక
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/17 జనవరి 2023 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ టీహబ్ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక శాఖ అందజేసే ‘జాతీయ అంకుర సంస్థల పురస్కారం-2022’ పొందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటరుగా ఎంపికైంది. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి సోం ప్రకాశ్ సోమవారం దీన్ని ఆన్‌లైన్‌లో అందజేశారు. ఆవిష్కరణలు, పారిశ్రామిక ప్రోత్సాహం, అభివృద్ధికి గాను ఈ పురస్కారం దక్కింది. ఈ విభాగంలో 55 ఇంక్యుబేటర్లు పోటీ పడగా..
తెలంగాణ విజేతగా నిలిచింది. జాతీయ పురస్కారం పొందిన టీహబ్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభినందించారు. ”ప్రారంభం నుంచి సంచలనాలు సృష్టిస్తున్న టీహబ్ ఇప్పటికే 2500కు పైగా అంకురాలకు సాయం అందించింది. వాటికి 13వేల కోట్ల పెట్టుబడులు సమీకరించడంతోపాటు 12500 మందికి ఉపాధి చూపింది” అని కేటీఆర్ పేర్కొన్నారు. టీహబ్‌కు జాతీయ పురస్కారం లభించడం పట్ల పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీహబ్ సీఈవో ఎం.శ్రీనివాస్‌రావులు హర్షం వ్యక్తం చేశారు.