రేపు తెలంగాణకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 25:
తెలంగాణలో టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

ఈ క్రమంలో కర్ణాటకను టార్గెట్ చేసుకుని తెలంగాణ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్న వేళ కర్ణాటక నేతలతోనే కౌంటర్ ఇప్పించేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు.

ఇప్పటికే ఏఐసీసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు తెలంగాణలో పర్యటిస్తూ పార్టీ కోసం ప్రచారం చేస్తుండగా..

రేపు తెలంగాణలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య పర్యటించబోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో సిద్ద రామయ్య ప్రచారం చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


ఈ టూర్‌లో భాగంగా బిఆర్ఎస్ నేతలు కర్ణాటక ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై రేపు గాంధీభవన్‌లో సిద్ధరామయ్య మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment