హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ : వివాదాల పరిష్కార కమిషన్ ఓ ఆసుపత్రికి షాక్ ఇచ్చింది. ఓ కేసులో కీలక ఆదేశాలు ఇచ్చింది. బాధిత కుటుంబానికి రూ.30లక్షలు పరిహారంగా చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఆ ఆసుపత్రిని ఆదేశించింది. వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ పేషెంట్ చనిపోవడానికి కారణమైన ఆసుపత్రిపై వినియోగదారుల ఫోరం కొరడా ఝళిపించింది.
పిటిషనర్ కాటం అరుణకు 31లక్షల 20వేల రూపాయల పరిహారం చెల్లించాలని శ్రీకాకుళంలోని GEMS ఆసుపత్రిని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది. అరుణ భర్త కాటం సురేశ్ జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం కారణంగానే తన భర్త చనిపోయాడని కాటం సురేశ్ భార్య కాటం అరుణ ఆరోపించారు.
పాటు డాక్టర్లు అతడికి చికిత్స అందించారు. అయితే, ట్రీట్ మెంట్ తీసుకుంటూ సురేశ్ చనిపోయారు. ఈ ఘటన ఏప్రిల్ 2021లో జరిగింది. తన భర్త మరణానికి GEMS ఆసుపత్రి డాక్టర్లే కారణం అని మృతుడి భార్య అరుణ ఆరోపించారు. తన భర్తకు సరైన వైద్యం అందించలేదని, ఆ కారణంగానే తన భర్త చనిపోయాడంది. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం నుంచి వివరణ కోరారు. అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంటికి పెద్ద దిక్కు అయిన భర్త చనిపోవడంతో తన కుటుంబం రోడ్డున పడిందని అరుణ వాపోయారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. డిసెంబర్ 20, 2022న ఆమె వినియోగదారుల ఫోరంలో పిటిషన్ వేశారు.
దీనిపై వినియోగదారుల ఫోరం విచారణ జరిపింది. పిటిషనర్ అరుణ తరపు లాయర్ విశ్వేశ్వర రావు కేసుని వాదించారు. ఆయన సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రఘుపాత్రుని చిరంజీవి సంచలన తీర్పు ఇచ్చారు. సురేశ్ మరణానికి ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అని కమిషన్ నిర్ధారించింది. బాధితురాలికి రూ.30లక్షలు పరిహారం చెల్లించాలని జెమ్స్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది. సురేశ్ మృతికి తప్పుడు వైద్య విధానం కారణమని తాను నిరూపించగలనని లాయర్ విశ్వేశ్వరరావు మీడియాకు తెలిపారు. కాగా, తన కుటుంబానికి న్యాయం జరిగేలా తీర్పు ఇచ్చారని వినియోగదారుల ఫోరంకు ధన్యవాదాలు తెలిపారు అరుణ.