నల్లగొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ
హ్యూమన్ రైట్స్ టుడే/నల్లగొండజిల్లా/నవంబర్ 04:
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం రామన్న పేట మండలంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు అత్యంత సన్నిహితులుగా వ్యహరించిన నేతలంతా ప్రతిపక్ష పార్టీ హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం
మండల జడ్పీటీసీ పున్న లక్ష్మీ జగన్మోహన్, మండల పార్టీ అధ్యక్షులు మందడి ఉపేందర్ రెడ్డి, 8 మంది సర్పంచులు నలుగురు ఎంపీటీసీలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఇప్పటికే మండల జడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
మిగతా సర్పంచులు ఎంపీటీసీలు రేపు ఎల్లుండి రెండు రోజుల్లో కారు దిగి హస్తం నీడలోకి వెళ్ళనున్నారని సమాచారం. ఇప్పటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు.
చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని ఎంతో ధీమాగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఇతర నాయకులకు ఒక్కసారిగా కంగు తింటున్నారు.
ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య మండలంలో పార్టీ మారుతున్న నేతల స్థానాన్ని చేసుకునేందుకు తన ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం.