బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించిన రవీందర్ నాయక్.
హ్యూమన్ రైట్స్ టుడే ( గార్ల): ప్రజలు ఎన్నికలలో దీవిస్తే, బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో బీ.సీ అభ్యర్థిని సీఎం గా నియామకం చేస్తుందని ఇల్లందు నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి ధరావత్ రవీందర్ నాయక్ పేర్కొన్నారు. స్థానిక పట్టణ కేంద్రం శుక్రవారం పెద్ద బజారులో భారతీయ జనతా పార్టీ మండల ఎన్నికల కార్యాలయాన్ని రాష్ట్ర నాయకులు రావుకా విమల్ కుమార్ జైన్, సోమ సుందర్, విచ్చేసిన శ్రేణులతో పాటు ఆయన పాలకాయ కొట్టి భారతమాతకు జై అంటూ కార్యకర్తలు నినాదాలు చేయగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం దేశానికి మూల వాసులైన ఆదివాసి బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత బిజెపికి దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుగునున్న ఎన్నికల్లో బిజెపికి పట్టం కడితే, బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం గుడిని, గుడి లింగాన్ని, అన్న చందంగా అవినీతిమయమైందని, పరిపాలన ఫామ్ హౌస్ లకే పరిమితం అయిందని ఆయన ఆరోపించారు. బయ్యారంలో స్టీల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని, 1970 నుంచి 76 వరకు బంజారాలను, ఎరుకల సామాజిక వర్గాలను షెడ్యూల్ ట్రైబ్స్ గా గుర్తించేందుకు కృషి చేశానాని, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ముందుండి ఉద్యమించానని, తెలంగాణ సాధన కోసం ప్రజా ప్రతినిధి అభ్యర్థిత్వానికి రాజీనామా చేసిన విషయాన్ని విశ్లేషించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన బంధు ఎందుకు అమలు చేయడం లేదని, ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వటం లేదని ఆయన ప్రశ్నించారు. ఇల్లందు నియోజకవర్గ ప్రజలు బిజెపికి పట్టం కట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అజ్మీర రాము, జస్వంత్ ఠాగూర్ టి నాగరాజు బుచ్చిబాబు వీర్య నాయక్, శివ కృష్ణ భాస్కర్, గోపికృష్ణ కత్తి రాజేష్, నీలం నాగేంద్రబాబు, ఎడ్ల రాజశేఖర్, జంపాల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.