51 రోజులు.. నో పోలీస్ సెల్యూట్.. నో ప్రోటోకాల్..*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ అక్టోబర్ 11: తెలంగాణలో ఎలక్షన్ నిబంధనలు అమలులోకి రావడం తో ఎమ్మెల్యే, మంత్రులకు ఇక పోలీసు సెల్యూట్ ఉండదు. ప్రోటోకాల్ కూడా ఉండదు. ఈ 51 రోజుల పాటు రాజ్యాంగ బద్దంగా లభించే గౌరవం పోలీసు సెల్యూట్, ప్రోటోకాల్ వారికి లభించదు. తిరిగి వారు రాజ్యాంగ బద్దమైన ఓటర్ల ఓట్ల హక్కు తో ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత వారికి రావాల్సిన రాజ్యాంగ గౌరవం, ప్రోటోకాల్ తిరిగి దక్కుతాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి రావడం తో ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ ప్రోటోకాల్, పోలీసు సెల్యూట్ కు దూరం అయ్యారు. భద్రత మాత్రం రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారుల పరిశీలనలో వెల్లడైన అంశాల మీద కొనసాగిస్తారు. ముఖ్యమంత్రికి కూడా కోడ్ నిబంధనలు వర్తిస్తాయి.