ఈస్ట్ కోస్ట్ ట్రైన్‌లో పొగలు.. భయంతో పరుగులు..

Get real time updates directly on you device, subscribe now.

ఈస్ట్ కోస్ట్ ట్రైన్‌లో పొగలు.. భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు

హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్/సెప్టెంబర్ 06:
ఈస్ట్ కోస్ట్ సూపర్ ఫాస్ట్ రైలులో పొగలు వచ్చాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కురవి మండలం గుడ్రాతమడుగు రైల్వే స్టేషన్‌లో ఈస్ట్ కోస్ట్ ట్రైన్‌లో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

ట్రైన్ హైదరాబాద్ నుంచి శాలీమర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పొగలు రావడంతో అరగంటపాటు ట్రైన్ ఆగిపోయింది.

పొగలు రావడంతో ట్రైన్‌ను గుండ్రాతిమడుగు స్టేషన్‌లో లోకోపైలట్ నిలిపి వేశాడు. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి సమాచారం అందుకుని వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ట్రైన్‌లో పొగలను అదుపులోకి తీసుకురాగా.. అనంతరం ట్రైన్ బయలుదేరింది. పొగలు రావడానికి ఒక ప్రయాణికుడే కారణమని తెలుస్తోంది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒక ప్రయాణికుడు ట్రైన్ చైన్ లాగి వదిలేశాడు. దీని వల్ల ట్రైన్ కదిలి కొద్దిదూరం వెళ్లిన తర్వాత బ్రేకులు పట్టేయడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. చైన్ లాగిన ప్రయాణికుడు ఎవరనేది తెలుసుకునేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment