పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 06:
గోదావరి పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగస్టులో పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు.
ప్రస్తుతం గోదావరికి వరదలు లేకపోవడంతో నిబంధనలను అనుసరించి పర్యాటక బోట్లు విహరించేందుకు అనుమతించారు బుధవారం ఒక పర్యాటక బోటులో ఉన్నతాధికారులు పేరంటపల్లికి వెళ్లారు.