*ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆటోపై కూలిన భారీ వృక్షం … డ్రైవర్ మృతి*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /సెప్టెంబర్ 02:
ఆటోపై చెట్టు కూలిపోవడంతో ఆటో డ్రైవర్ మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే కాలనీలో భారీ వృక్షం కుప్ప కూలింది. సిగ్నల్ వద్ద నిలిచిన రెండు ఆటోలపై ఒక్కసారిగా పడింది. దీంతో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ కాసేపు నిలిచిపోయింది.