ఒన్ నేషన్..ఒన్ ఎలక్షన్..తెలంగాణ ఎన్నికలు వాయిదా..?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /సెప్టెంబర్ 01: ఈ డిసెంబర్ లో తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు కేంద్రం జమిలి ఎన్నికల దిశగా పార్లమెంట్ లో బిల్లు లేదా రాజ్యంగ సవరణలు చేస్తే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ గడవు ముగిసే సమయానికి కొత్త సభ్యులతో సభ కొలువు తీరాల్సి ఉంది.
అదే సమయంలో ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణలో ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. పార్లమెంట్ లో నిర్ణయం జరిగితే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు లోక్ సభ ఎన్నికలతో పాటుగా జరిగే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అదే సమయంలో మార్చిలో ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లొ పార్లమెంట్ తో పాటుగానే ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్రం అనుకున్నది అనుకున్నట్లుగా ప్లాన్ అమలు చేస్తే లోక్ సభతో పాటుగా 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సాధ్యా సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ఆధ్వర్యంలో 16 మందితో కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. దీంతో, ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తీసుకొనే నిర్ణయాలకు అనుగుణంగా తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా, లేక ఆలస్యం అవుతాయా అనేది స్పష్టత రానుంది.