అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిక ఈ రాఖీ పండుగ: ఎమ్మెల్సీ కవిత ట్విట్
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 31:
రాఖీ పండుగ అంటేనే అనుబంధాలకు ప్రతీక. తమ సోదరులకు తోబుట్టువులు రాఖీ కట్టి.. ఈ అనుబంధం కలకాలం కొనసాగాలని కోరుకుంటారు. ఒకరికొకరు ఆశీర్వాదం తీసుకుంటారు. అంతటి ప్రత్యేకమైన రాఖీ పండుగ రోజు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎమోషనల్ ట్వీట్ చేశారు.
అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే నా ‘అన్న’ అంటూ మంత్రి కేటీఆర్‌తో ఉన్న ఫొటోను ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఇక మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
రాఖీ పండుగ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. సోదరి సౌమ్య జోగినిపల్లితో కలసి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ ట్విట్టర్ వేదికగా ఫొటోలను షేర్ చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని పేర్కొన్నారు.