చంద్రమండలంలో అమ్మకానికి భూమి..
హ్యూమన్ రైట్స్ టుడే/కరీంనగర్ జిల్లా /ఆగస్టు 26:
అయితే చంద్రుడిపై భూమి కొనుగోలు విషయంలో కొన్ని షరతులు వర్తిస్తాయి. సాధారణంగా చంద్రుడిపై భూమి సమతలంగా ఉండదు.
ఎన్నో బిలాలు, రాళ్లతో కూడి ఉంటుంది. భూమిపై మాదిరిగానే చంద్రుడిపై కూడా కొన్ని ఏరియాలు ఉంటాయి. వాటికి కూడా కొన్ని పేర్లను కేటాయించారు.
అయితే ఈ భూమిపై కొనుగోలుదారులు యాజమాన్య హక్కులు పొందలేరు. కేవలం పేరుపై భూమి రిజిస్ట్రర్ అయ్యి ఉంటుంది.
గతంలోనే చాలా మంది సెలబ్రిటీలు చంద్రుడిపై భూమిని కొనుగోలు చేయగా తాజాగా తెలంగాణకు చెందిన మహిళ తన తల్లి మీద ప్రేమతో ఈ స్థలం కొనుగోలు చేసింది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 అడుగుపెట్టిన రోజే సాయి విజ్ఞత అనే మహిళ భూమి కొనుగోలు కోసం పెట్టుకున్న రిజిస్ట్రేషన్ పూర్తి కావడం విశేషం.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రామచంద్ర, వకుళాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవాలో నివసిస్తోంది. ఆమె గవర్నర్ కిమ్ రెనాల్డ్స్‌కు ప్రాజెక్ట్ మేనేజర్‌గా, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది 2022లో లూనార్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో చంద్ర మండలంపై స్థలం కోసం ఆమె దరఖాస్తు చేసుకోగా మొన్నటివరకు పెండింగ్‌లో ఉంది. ఈనెల 23న సాయి విజ్ఞత తన తల్లి వకుళాదేవి, తన కూతురు ఆర్త సుద్దాల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు డాక్యుమెంట్లు అందాయి.
మొత్తంగా చంద్రుడిపై ఎకరం స్థలం సాయి విజ్ఞత కొనుగోలు చేసింది. చంద్ర మండలంలో ఎకరం స్థలం ఇప్పుడు రూ.35 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం.