హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 25:
రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును 65 ఏండ్లకు పెంచారు.
ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు రూ. లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. టీచర్లు, హెల్పర్లు పదవీ విరమణ చేసిన అనంతరం ఆసరా పెన్షన్లు మంజూరు చేయనున్నారు.
3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాల స్థాయిని పెంచారు. ఈ మినీ అంగన్‌వాడీలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడు సార్లు అంగన్‌వాడీల వేతనాలు పెంచారని మంత్రి గుర్తు చేశారు.