వరంగల్ లో స్వల్ప భూకంపం

Get real time updates directly on you device, subscribe now.

రిక్టర్ స్కేల్ పై 3.6 వరంగల్ లో సల్ప భూకంపం..


హ్యూమన్ రైట్స్ టుడే/వరంగల్ జిల్లా/ఆగస్టు 25:
వరంగల్ లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 :43 గంటలకు భూమి కంపించింది.

దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మొలజి తెలియజేసింది. భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోపల కదలికలు సంభవించినట్లు వెల్లడించింది.

తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టం పై ఇప్పటికీ సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment