తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ రానున్నది: మంత్రి కేటీఆర్

Get real time updates directly on you device, subscribe now.

రాష్ట్ర ప్రభుత్వంతో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR)తో ఒప్పందం…

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/16 జనవరి 2023: తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ రానున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR)తో ఒప్పందం చేసుకున్నది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సోమవారం ఒప్పందం జరిగింది. హెల్త్‌కేర్‌, లైఫ్‌ సెన్సెస్‌ రంగాల్లో సీ4ఐఆర్‌ సంస్థ సేవలు అందించనున్నారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లో ఈ సంస్థ సేవలు అందిస్తున్నది. భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో సంస్థ ఏర్పాటుకానున్నది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్జెన్స్ తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శక్తినాగప్పన్‌తో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

హెల్త్‌కేర్‌, లైఫ్‌ సెన్సెస్‌పై దృష్టి సారించిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR)ని స్థాపించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ హైదరాబాద్‌ను తన భారతదేశ హబ్‌గా ఎంచుకున్నందుకు సంతోషం ఉందన్నారు. హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌ సంస్థ ఏర్పాటుతో తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రస్తుతం ఉన్న పర్యావరణ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వ సమర్థతను ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్స్ ప్రాధాన్యత రంగాల్లో ఒకటని, హైదరాబాద్‌లో C4IR సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సృష్టించిన విలువ. ప్రభావాన్ని మరింత వేగవంతం చేయడానికి ప్రస్తుత పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని కేటీఆర్‌ అన్నారు. సీ4ఐఆర్‌ సంస్థ ఏర్పాటుతో ప్రభుత్వ రంగం, ఎస్‌ఎంఈల మధ్య వంతెనలను నిర్మించడంలో.. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధిని సృష్టించడంలో కీలక పాత్ర పోసిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గే బ్రెండే అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment