దేశం గర్వంతో ఉప్పొంగుతుంది: ఎమ్మెల్సీ కల్వకుంట్ల

Get real time updates directly on you device, subscribe now.

చంద్రయాన్‌-3 సక్సెస్‌తో ప్రపంచం మన వైపే చూస్తుంది: కల్వకుంట్ల కవిత

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌/ఆగస్టు 23:
చంద్రయాన్‌-3 విజయవంతం చారిత్రాత్మకమైనదని, దేశం గర్వంతో ఉప్పొంగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

చంద్ర మండలంపై త్రివర్ణ జెండా రెపరెపలాడుతుందని తన సంతోషాన్ని ట్విటర్‌ వేదిక ద్వారా పంచుకున్నారు. విశ్వప్రయాణంలో అద్భుతమైన ఘట్టమని ఆమె పేర్కొన్నారు . చంద్రయాన్ 3తో సక్సెస్‌ ప్రతీ భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగుతుందని, ప్రపంచం మనవైపే చూస్తుందని అన్నారు.

*అద్భుత విజ‌యం .. మంత్రి ఎర్రబెల్లి*

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 విజయవంతమ‌వ‌డం చ‌రిత్రలో అత్యంత అద్భుత విష‌య‌మ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌ శాఖ‌ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు.
ల్యాండర్‌ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండ్‌ సాధించిన తొలి దేశంగా భారత్‌ చరిత్రలో నిలిచింద‌ని పేర్కొన్నారు.

ఈ విజయం భ‌విష్యత్తులో మ‌రిన్ని విజ‌యాల‌కు అంకురార్పణ జ‌రిగింద‌న్నారు.

ఇది భార‌త జాతి గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యంగా పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల‌కు మంత్రి శుభాకాంక్షలు, అభినంద‌న‌లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment