జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా దండు శ్రీకాంత్
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/ఆగష్టు 22: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు R. కృష్ణయ్యని నిజామాబాద్ జిల్లా బీసీ నాయకులు దండు శ్రీకాంత్ సోమవారం కలవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో బీసీలకు ఎటువంటి సమస్యలు వచ్చిన పరిష్కరిస్తూ, బీసీల కోసం ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి నిజామాబాద్ బీసీ ముద్దు బిడ్డ దండు శ్రీకాంత్ ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం అందచేయడం జరిగింది. ఈ సంధర్భంగా నూతన బీసీ జాతీయ సంక్షేమ సంఘం తెలంగాణ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దండు శ్రీకాంత్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతను అప్పచెప్పిన ఆర్. కృష్ణయ్య అడుగు జాడల్లో నడుస్తూ బీసీ హక్కుల కోసం పోరాడుతానని అన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గుజ్జు కృష్ణ, టి రాజ్ కుమార్, బీసీ విద్యార్థి నాయకులు ఫైళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.