హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగస్టు 17:
నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్, క్యాన్సర్, యూరాలజీ విభాగాలను నెదర్లాండ్ బృందం సందర్శించింది.
ఇందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్ కూడా ఉన్నారు. నిమ్స్‌లో అందిస్తున్న చికిత్సలను అధ్యయనం చేసేందుకు ఈ బృందం పర్యటించింది. నెదర్లాండ్స్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ జాన్ కైపెర్స్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో నిమ్స్ ఆస్పత్రి ప్రతిష్ట గురించి అనేక విషయాలు విన్నానని తెలిపారు.
స్వయంగా చూసేందుకు నిమ్స్‌కి వచ్చానన్నారు. ఇక్కడ వివిధ విభాగాల పనితీరు గురించి అధ్యయనం చేసేందుకు నిమ్స్‌కి వచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో వైద్య సేవలు బాగున్నాయని, అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు బాగున్నాయని ప్రశంసించారు.