పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం..
హ్యూమన్ రైట్స్ టుడే/పెద్దపల్లి జిల్లా /ఆగస్టు 17:
మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో చోటుచేసుకుంది.
రెండు రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ కు చెందిన మైనర్ బాలిక పై నలుగురు వ్యక్తులు రెండు రోజుల క్రితం రాత్రి పెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో అగాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది.
తీవ్రంగా గాయపడిన బాలికను ఓ ప్రైవేటు వాహనంలో మధ్యప్రదేశ్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం.. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.