బోనాల ఉత్సవాలలో కత్తి పోట్లు..

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జులై 17:
తార్నాకలో బోనాల ఉత్సవాలలో కత్తి పోట్లు కలకలంరేపాయి. అర్ధ రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తార్నాక స్ట్రీట్ నంబర్ 10 లో అమ్మవారి దేవాలయం వద్ద యువకులు మద్యం సేవించారు. ఈ క్రమంలో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. అందులో ఓ యువకుడు ముగ్గురిని కత్తితో పొడిచాడు. గాయాలపాలైన ముగ్గురిని గాంధీ హాస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వారందరూ గంజాయి బ్యాచ్ అని, గంజాయి అమ్ముతుంటారని తెలియవచ్చింది. గంజాయిని వివిధ రేట్లకు అమ్ముతుంటారు. తక్కువ రేట్లకు అమ్మవద్దని వారిలో గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందామని తార్నాక ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గాయాలైన వారి పేర్లు.. సూర్య, హరీష్, లోకేష్. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment