మంచులో గర్భిణిని 14 KM మోసుకెళ్లిన జవాన్లు
హ్యూమన్ రైట్స్ టుడే/ఆర్మీ/16 జనవరి 2023: ఇండియన్ ఆర్మీ జవాన్లు మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. జమ్మూ కాశ్మీర్ రంబన్ జిల్లాలోని హర్గమ్ అనే మారుమూల గ్రామంలో ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు సమాచారం రావడంతో 14 కిలోమీటర్లు ఆమెను మోసుకెళ్లారు. మంచులో కూరుకుపోయి రోడ్లు జారుడుగా ఉండటంతో కాలినడకన ఎంతో శ్రమించి మరో ప్రాంతానికి తరలించారు. అక్కడ సిద్ధంగా ఉంచిన అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.