* హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జులై 14:
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్ నగరంలో ‘భారత జాగృతి ఆస్ట్రేలియా’ ఆధ్వర్యంలో బోనాలు సంబురాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు బ్రిస్‌బేన్‌లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులతోపాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.
అలాగే జులై 16న న్యూజిలాండ్‌లోని అక్లాండ్ నగరంలో జరగనున్న బోనాలు వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొంటారు. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ బోనాల వేడుకలకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. అక్లాండ్‌లోని గణేష్ టెంపుల్‌లో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు.
అలాగే అక్లాండ్‌లో ఉదయం 9 గంటలకు వివిధ రాష్ట్రాల ఎన్నారైలు ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయ సమ్మేళనం లో కవిత పాల్గొంటారు. సాయంత్రం తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్‌లో ఆస్ట్రేలియాలోని తెలంగాణీయులతో సమావేశం అవుతారు. ఆల్బర్ట్ వార్ మెమోరియల్ హాల్ లో ఈ సమావేశం జరగనుందని నిర్వాహకులు తెలిపారు.