వైద్య శాఖలో నోటిఫికేషన్ విడుదల

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జులై 13:
తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్య శాఖ, ఆయుష్ విభాగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిది. 156 వైద్యుల పోస్టుల భర్తీకి గురువారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద ఆయుర్వేదం 54, హోమియో 33, యునాని 69 వైద్యుల పోస్టులను భర్తీ చేయబోతున్నది. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నోటిఫికేషన్ సందర్భంగా మంత్రి హరీష్ రావు స్పందిస్తూ వైద్యారోగ్య శాఖలో కొలువుల జాతర కొనసాగుతున్నదని ఈ అవకాశాన్ని అభ్యర్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment