హ్యూమన్ రైట్స్ టుడే/కడప జిల్లా / జులై 14:
ప్రొద్దుటూరు మండలం కానా పల్లె ఎస్సీ కాలనీలో ఈరోజు తెల్లవారుజామున వ్యక్తి దారుణ హత్యకు గురైనట్టు తెలిసింది. గురువారం రాత్రి ఇంటి పై భాగంలో పడుకుని ఉన్న బాబు అనే వ్యక్తిని గొంతు కోసి చంపిన గుర్తు తెలియని దుండగులు. ఉదయం ఎంత సేపటికి కిందికి రాకపోవడంతో భార్య పైకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో భర్త. పక్కింటి పై భాగంలో నుంచి దుండగులు వెళ్ళినప్పుడు పడిన రక్తపు మరకలు, సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.