*నార్సింగిలో దారుణం?*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 21:
గండిపేట మండలం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోమంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు కత్తితో పొడిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వాసవి, గణేష్‌లు హైదరాబాద్‌కు ఉద్యోగాల నిమిత్తం వచ్చారు. వాసవి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా.. గణేష్ జొమాటోలో పని చేస్తున్నాడు. వీరిద్దరూ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రతిరోజు సాయంత్రం వీరిద్దరూ కలుసుకుంటూ ఉంటారు. కానీ మంగళవారం రాత్రి నార్సింగి టీ గ్రిల్ హోటల్ వద్దకు పిలిచాడు. ఆమె హోటల్ వద్దకు వచ్చింది. ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. దీంతో గణేష్ ఒక్కసారిగా తన బ్యాగ్‌లో నుంచి కత్తిని తీసి హెను పొడిచి పారిపోయాడు. వాసవి మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత భయంతో 100కి ఫోన్ చేసి హాస్పిటల్‌కి తరలించాడు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.