*15న నాగపూర్ బీఆర్‌ఎస్ భవనం ప్రారంభం.. కేసీఆర్ చేతుల మీదుగా శ్రీకారానికి చర్యలు*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 13: బీఆర్‌ఎస్ తన తొలి సొంత శాశ్వత భవనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించబోతున్నది. నాగపూర్‌లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 15న ఉదయం నాగపూర్ వెళ్లనున్న కేసీఆర్ అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసిన చేరికల సమావేశంలోనూ పాల్గొంటారు.
ముంబై, పుణె, ఔరంగాబాద్‌లోనూ పార్టీ ఆఫీస్‌లను ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకు పార్టీ భవనాల కోసం అన్వేషణ జరుగుతున్నది. బీఆర్‌ఎస్‌కు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా, పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నియామక కార్యక్రమాన్ని చేపట్టింది. అటు.. ఈ నెల 19న నాందేడ్‌లో పార్టీ అధినేత కేసీఆర్ రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.