శిరీష హత్య ఘటనలో కీలక మలుపు..ముఖ్యదోషిగా బావ

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/పరిగి/జూన్ 11:
వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్‌ గ్రామం జట్టు శిరీష(19) అనే యువతి దారుణ హత్యకు గురయింది. ఈ కేసు విచారణలో పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ‘‘శిరీష హత్య కోసం నిందితుడు స్క్రూ డ్రైవర్ వాడినట్టు మేం ఎక్కడా చెప్పలేదు. పదునైన ఆయుధంతో కంట్లో పొడిచినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. యువతిపై అత్యాచారం జరిగినట్టు ఆనవాళ్లు లేవు. ఇంకా పోస్ట్‌మార్టం పూర్తికాలేదు. యువతి ఫోన్ సీజ్ చేశాం… సాంకేతిక సాక్షాలు సేకరిస్తున్నాం. విచారణ కొనసాగుతోంది. శిరీష బావను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని,డీఎస్పీ తెలిపారు.

*ముఖ్యదోషిగా తేలనున్న శిరీష బావ*

*అసలేం జరిగిందంటే..*

శిరీష అర్ధరాత్రి దుండగుల చేతిలో హత్యకు గురైంది. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్‌ గ్రామానికి చెందిన జట్టు శిరీష(19) వికారాబాద్‌లోని ఓ నర్సింగ్‌ కళాశాలలో చదువుతోంది. శిరీష కళాశాల నుంచి మూడు రోజుల క్రితమే ఇంటికి వచ్చింది. తల్లి యాదమ్మకు ఆరోగ్యం బాగాలేక శిరీష అన్న శ్రీకాంత్‌ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. శనివారం రాత్రి ఇంటి వద్ద శిరీష, ఆమె తండ్రి జంగయ్య ఇద్దరే ఉన్నారు. రాత్రి పది గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తిరిగి రాలేదు. ఆదివారం మధ్యాహ్నం గ్రామ శివారు మైసమ్మ ఆలయ సమీపంలో శిరీష మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలి కళ్లలో కత్తితో పొడిచారు. మెడపైనా కత్తిపోట్లున్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలాన్ని పరిగి డీఎప్పీ కరుణసాగర్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. శిరీష ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

*శిరీష హత్యపై పలు అనుమానాలు*

*శిరీష తండ్రిని ఆమె తమ్ముడిని విచారించిన పోలీసులు*


శిరీష హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శిరీష కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది. ఆమెను కాలేజీ మన్పించినట్టు తెలుస్తోంది. హత్యకు ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమా? రాత్రి పూట ఆమె బయటకు ఎందుకు వెళ్లింది? బంధువులు ఎవరైనా ఫోన్‌ చేసి బయటకు రమ్మని ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment