వికారాబాద్‌లో 19 ఏళ్ల యువతి దారుణహత్య

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/వికారాబాద్/జూన్ 11:
మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని పెద్దలు చెప్పిన మాట. అనాధిగా ఇక్కడ స్త్రీలను గౌరవిస్తూ పూజిస్తూ వస్తున్నారు. అంతెందుకు దేశాన్ని భరతమాతగా కొలుస్తున్నాం. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఆకృత్యాలకు గురవుతూనే ఉన్నారు. ఐదేళ్ల పసిపాపల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు నిత్యకృత్యమైపోయాయి. నానాటికి మహిళలపై గృహహింసతో పాటు అనేక రూపాల్లో లైంగికంగా మానిసిక వేధింపులకు గురవుతున్నారు. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న హింస పరాకాష్టకు చేరింది.

హైదరాబాద్‌లో అప్సర దారుణహత్య మరువకముందే మరో యువతి దారుణ హత్య ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) అనే యువతి ని దుండగులు హత్య చేశారు. శనివారం అర్ధ రాత్రి సమయంలో ఇంటి నుంచి శిరీష బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. ఈ రోజు మధ్యాహ్నం చెరువు కుంట ఒడ్డున యువతి దుస్తులు స్థానికుల కంట పడ్డాయి. అనుమానంతో కుంటలో శిరీష కోసం వెతికారు. కుంటలో యువతి మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలాన్ని పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి పరిశీలించారు. యువతి మృతదేహంపై కత్తిగాట్లను పోలీసులు గుర్తించారు. సమగ్ర విచారణ జరుపుతున్నామని త్వరలోనే
నిందితులను గుర్తించి శిక్షస్తామని డీఎస్పీ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment