హ్యూమన్ రైట్స్ టుడే/జీడిమెట్ల/జూన్ 09:
సడెన్ గా హార్ట్ ఎటాక్ వస్తుంది, ఆ మరుక్షణమే ప్రాణం పోతుంది. ఈ తరహా మరణాల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య పెరిగిపోయింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అందరూ గుండెపోటు బారిన పడుతున్నారు. అంతలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. జబ్బులతో బాధపడుతున్న వారే కాదు.. ఎలాంటి అనారోగ్యం లేని వారు ఎంతో హెల్తీగా, ఫిట్ గా ఉన్న వారు కూడా హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. సడెన్ గా హార్ట్ ఎటాక్ వస్తుంది, ఆ మరుక్షణమే ప్రాణం పోతుంది. ఈ తరహా మరణాల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
తాజాగా జీడిమెట్లలో విషాదం చోటు చేసుకుంది. దుండిగల్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. గండి మైసమ్మలోని తన ఇంట్లో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఎస్ఐ ప్రభాకర్ ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దాంతో ఎస్ఐ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు.