హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను త్వరలో చేపట్టనున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర స్థాయిలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ‘జాబితా రూపకల్పన కోసం పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులతో ఆగస్టు 2 నుంచి ఇంటింటి సర్వే నిర్వహిస్తాం. ముసాయిదా ఓటర్ల జాబితాను అక్టోబరు 4న ప్రకటిస్తాం. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించిన వివిధ దరఖాస్తులు http://voters.eci.gov.inలో అందుబాటులో ఉన్నాయి’ అని వికాస్‌రాజ్ వివరించారు.