రయ్‌మని దూసుకెళ్తున్న వందే భారత్.. ప్రారంభించిన మోదీ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/15 జనవరి 23: సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోదీ మాట్లాడుతూ.. ‘‘తెలుగు ప్రజలకు వందేభారత్ పండగ కానుక. 2023లో ప్రారంభిస్తున్న తొలి వందేభారత్ రైలు ఇది. పూర్తిగా దేశీయంగా తయారైన వందేభారత్ అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది’’ అని తెలిపారు. సోమవారం నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభంకానున్నాయి.