చీమలపాడు గ్యాస్ పేలుడులో గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే రాములు నాయక్
ఎంపీ నామా ప్రకటించిన 50వేలు అందజేత
హ్యూమన్ రైట్స్ న్యూస్ టుడే/ఖమ్మం
ఖమ్మంజిల్లా : చీమలపాడు గ్యాస్ పేలుడు ఘటనలో గాయపడి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు తేజావత్ భాస్కర్ అంగోత్ రవి కుమార్ దేవా నవీన్ లను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి ఖమ్మం జిల్లా ఎంపీ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు 50,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించినరీతిగా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా రైతు బంధు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీ వ్యక్తిగత సహాయకులు మేడల సత్యనారాయణ,జిల్లా నాయకులు చిత్తారు సింహాద్రి ,సర్పంచ్ లు మాలోత్ కిషోర్, బాణోత్ కుమార్ యాదవ్, నాయకులు బత్తుల శ్రీనివాస్, డేగల ఉపేందర్, ఎర్రబెల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.